1 సహోదరులారా, మకెదొనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.
2 ఏలాగనగా వారు బహు శ్రమలవలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహూగా విస్తరించెను.
3-4. ఈ కృప విషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
5 ఇదియు గాక మొదట ప్రభువుకును, దేవుని చిత్తమువలన మాకును తమ్ము తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
6 కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి.
7 మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రతయందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందుకూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
8 ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రతను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై యుండినను, మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
10 ఇందునుగూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్సరము క్రిందటనే యీ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటివారై యుండిన మీకు అది చాలును.
11 కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి.
12 మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమికొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
13 ఇతరులకు సుఖమును మీకు కష్టమును కలుగవలెనని యిది చెప్పుటలేదు గాని
14-15. -నిండుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగుల లేదనియు కొంచెముగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియు1వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును (మరియొకప్పుడు ) వారి సమృద్ధి మీయక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
16 మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.
17 అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు.
18 మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితోకూడ పంపుచున్నాము.
19 అంతేకాక మన ప్రభువుకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి.
20 మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు (అతని పంపుచున్నాము. )
21 ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైనవాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
22 మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. అనేక సంగతులలో అనేక పర్యాయములు అతని పరీక్షించి అతడు ఆసక్తిగలవాడనియు, ఇప్పుడును మీయెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు తెలిసికొనియున్నాము.
23 - తీతు ఎవడని (యెవరైన అడిగినయెడల ) - అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునైయున్నాడనియు; - మన సహోదరులెవరని (అడిగినయెడల ) - వారు సంఘముల దూతలును2క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.
24 కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి3సంఘములయెదుట కనుపరచుడి.
Download Audio File

No comments:
Post a Comment