1 కాగా మేమాయనతోటిపనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.
2 -అనుకూల సమయమందు నీ మనవి ఆలకించితిని;రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినిఅని ఆయన చెప్పుచున్నాడు గదా?1ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణదినము.
3 మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక
4 శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును
5 దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,
6 పవిత్రతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన, ప్రేమతోను
7 సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడి యెడమల నీతి ఆయుధములు కలిగి,
8-10. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యున్నామని అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్లమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము; దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
11 ఓ కొరింథీయులారా అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను;2మా హృదయము విశాలపరచబడియున్నది.
12 మీయెడల మా అంతఃకరణమే సంకుచితమై యున్నది.
13 మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.
14 మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు?
15 క్రీస్తుకు బెలియాలుతో ఏమి సందర్భము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
16-18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము;అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు3నేను వారిలో నివసించి సంచరింతును, నేనువారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. - కావున మీరు వారి మధ్యనుండిబయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి;అపవిత్రమైనదాని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు- మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
Download Audio File

No comments:
Post a Comment