1 యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి పౌలను నేను మిమ్మును వేడుకొనుచున్నాను. నేను మీ యెదుట నున్నప్పుడు మీలో అణుకువగలవాడను, ఎదుటలేనప్పుడు మీయెడల ధైర్యముగలవాడను.
2 శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
3 మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరప్రకారము యుద్ధము చేయుము.
4 మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని దేవునియెదుట దుర్గములను పడద్రోయజాలిన బలముకలవై యున్నవి.
5 మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
6 మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి యున్నాము.
7 సంగతులను పైపైన నే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకొనిన పక్షమున అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
8 పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.
9 నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను.
10 - అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.
11 మేమెదుటలేనప్పుడు పత్రికలద్వారా మాటలయందెట్టివారమై యున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.
12 తమ్మునుతామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితో నొకరు సరిచూచుకొనుచున్నందున, గ్రహింపులేక యున్నారు.
13 మేమైతే మేరకు మించి అతిశయపడముగాని మీరున్న స్థలమువరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.
14 మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్నవారము కాము.
15 మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,
16 మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరియొకని మేరలో చేరి సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.
17 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.
18 ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్నుతానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.
Download Audio File

No comments:
Post a Comment