1 మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీయొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?
2 మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరే కారా?
3 రాతి పలకలమీద సిరాతో వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
4 క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు
5 మావలన ఏదైన అయినట్టుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది.
6 ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును.
7-8. మరణకారమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములతో సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?
9 శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమకలదగును.
10 అత్యధికమైన మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.
11 తగ్గిపోవునదే2మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా?
12-13. తగ్గిపోవుచున్న2(మహిమ ) అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను. మేమట్లు చేయక, యిట్టి నిరీక్షణగలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము.
14 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
15 నేటివరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని
16 వారి హృదయము ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
17 ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
18 మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మచేత1ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
Download Audio File

No comments:
Post a Comment