1 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదము.
2 మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపై ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
3-4. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము.
5 దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
6 వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము.
7 గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని యెరిగియుండియు, ఎల్లప్పుడును ధైర్యముకలవారమై యున్నాము.
8 ఇట్లు ధైర్యము కలిగి యీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
9 కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము.
10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినవాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
11 కావున మేము ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.
12 మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుటలేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయాస్పదము కలిగించుచున్నాము.
13 ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే.
14 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
15 జీవించువారికమీదట తమకొరకు కాక తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము.
16 కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైన ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను;
18 సమస్తమును దేవునివలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన విషయమైన పరిచర్యను మాకు అనుగ్రహించెను.
19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక; క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును (ప్రచురించుట ) మాకు అప్పగించెను.
20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయభారులమై - దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసరము పాపముగా చేసెను.
Download Audio File

No comments:
Post a Comment